: మరోసారి తల్లి కాబోతున్న పాప్ క్వీన్


పాములా నడుమును మెలితిప్పుతూ 'వాకా వాకా' అనే పాటతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్ క్వీన్ షకీరా రెండోసారి తల్లి కాబోతోంది. స్పానిష్ సాకర్ స్టార్ గెరార్డ్ పిక్ తో కలసి ఉంటున్న ఈ కొలంబియా పాప్ స్టార్ షకీరా తాను రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని వెల్లడించింది. షకీరాకు గ్రీటింగ్స్ చెబుతూ ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు నిడియా, విలియం కూడా మీడియాకు తెలిపారు. షకీరాకు మిలన్ అనే 19 నెలల కుమారుడున్నాడు. త్వరలో తనకు పుట్టేది అబ్బాయే అని తెలిపిన షకీరా ఆ చిన్నారికి ఏ పేరు పెట్టాలనుకుంటోందో మాత్రం వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News