: కేటీఆర్ సెటిల్ మెంట్లపై వార్తలు ప్రసారం చేశాం... అందుకే ఈ కక్ష సాధింపు: 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ
కేటీఆర్ సెటిల్ మెంట్ల వ్యవహారంపై తాము ఎన్నికల ముందు వార్తలు ప్రసారం చేశామని... దాన్ని మనసులో పెట్టుకునే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీఎన్ చానల్ పైనా, ఆంధ్రజ్యోతి పత్రిక పైనా కక్షసాధింపు చర్యలకు కేసీఆర్ దిగారని ఆ సంస్థల ఎండీ రాధాకృష్ణ 'టైమ్స్ నౌ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి స్వతంత్రంగా వ్యవహరిస్తాయని... తమను టార్గెట్ చేస్తే మిగతా మీడియా చానెళ్లు కూడా దాసోహమవుతాయన్న కుతంత్రంతోనే కేసీఆర్ ఇంతటి దారుణ చర్యకు ఒడిగట్టారని ఆయన వ్యాఖ్యానించారు.