: బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ చోరీకి గురైంది!


దేశం గర్వించదగ్గ షెహనాయ్ విద్వాంసుడు దివంగత బిస్మిల్లా ఖాన్ కు చెందిన షెహనాయ్ వాయిద్యం చోరీకి గురైంది. వారణాసిలోని ఆయన నివాసంలో ఉండాల్సిన ఈ వాయిద్యం కనిపించలేదు. బిస్మిల్లా ఖాన్ ప్రతి కచ్చేరీలోనూ ఈ షెహనాయ్ తోనే ప్రదర్శన ఇచ్చేవారని తెలుస్తోంది. కాగా, చోరీకి గురైన వాయిద్యాన్ని అంతర్జాతీయ మార్కెట్ కు స్మగ్లింగ్ చేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఇంకా ఫిర్యాదు చేయలేదు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, బిస్మిల్లా ఖాన్ ప్రతిభకు 2001లో 'భారతరత్న' పురస్కారం దక్కడం విశేషం.

  • Loading...

More Telugu News