: శారదా చిట్ ఫండ్ స్కాంలో తృణమూల్ ఎంపీకి సమన్లు
శారదా చిట్ ఫండ్ స్కాంలో సీబీఐ దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర అధికార పార్టీ తృణమూల్ రాజ్యసభ సభ్యుడు శ్రింజాయ్ బోస్ కు సీబీఐ సమన్లు పంపింది. ఈ క్రమంలో కొన్ని రోజుల్లో ఆయన విచారణకు హాజరవుతారు. కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో ఇప్పటికే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు తృణమూల్ నేతలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, పశ్చిమబెంగాల్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రజత్ మజుందర్ ను ఇదే స్కాంలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.