: నెలలోగా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి: సుప్రీంకోర్టు
నెల రోజుల్లోగా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను రద్దు చేసి కొత్తగా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్ ను మంగళవారం విచారించిన సందర్భంగా జస్టిస్ హెచ్ ఎల్ దత్తు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ప్రజాప్రతినిధుల కొనుగోలు యత్నాలకు చెక్ పెట్టాలని సూచించింది. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారానే ప్రజా ప్రతినిధుల కొనుగోలు తరహా దుస్సంప్రదాయాలకు చెక్ పడే అవకాశాలున్నాయని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది.