: జాతీయ మీడియా పతాక శీర్షికల్లో కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు


మీడియాపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేసిన ఘాటు వ్యాఖ్యలు జాతీయ మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాయి. తెలంగాణను కించపరిచేలా వ్యవహరించే ఏ టీవీ ఛానెల్ నైనా సజీవ సమాధి చేస్తామని మంగళవారం వరంగల్ లో నిర్వహించిన కాళోజీ శత జయంతి వేడుకల సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు టీవీ ఛానెళ్లు తెలంగాణను, తెలంగాణ ఎమ్మెల్యేలను కించపరిచేలా వార్తలను ప్రచారం చేశాయని చెప్పిన ఆయన, ఎమ్మెస్వోల నిర్ణయం మేరకే వాటి ప్రసారాలు తెలంగాణలో నిలిచిపోయాయన్నారు. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని చెప్పిన కేసీఆర్, స్పీకర్ పరిధిలోని ఈ విషయంపై తానేమీ చేయలేనని వ్యాఖ్యానించారు. కొద్దిరోజులుగా తెలంగాణలో నిషేధానికి గురైన రెండు తెలుగు టీవీ ఛానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ, మహిళా జర్నలిస్టులు హైదరాబాద్ లోని కేసీఆర్ అధికార నివాసం ముందు ఆందోళనకు దిగడం, వారికి మద్దతుగా వరంగల్ పర్యటన సందర్భంగా విలేకరుల నిరసనల నేపథ్యంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనైన కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం మీడియాపై నిప్పులు చిమ్మింది. తెలుగు చానెళ్ల ప్రసారాలపై ఇటీవలి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో భేటీ సందర్భంగా, తమ ప్రమేయమేదీ లేదని చెప్పిన కేసీఆర్, మంగళవారం ఈ అంశంపై ఘాటుగా స్పందించడంతో జాతీయ మీడియా ఒక్కసారిగా ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.

  • Loading...

More Telugu News