: నేడు ఆఫ్ఘనిస్థాన్ వెళుతున్న సుష్మాస్వరాజ్
భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నేడు ఆఫ్ఘనిస్థాన్ పర్యటనకు బయలుదేరుతున్నారు. వ్యూహాత్మకంగా భారత్ కు ఆఫ్ఘనిస్థాన్ కీలక భాగస్వామిగా ఉంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికే ఆఫ్ఘన్ కు సుష్మ వెళుతున్నారు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో ఆ దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో ఆమె భేటీ అవుతారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వీరు చర్చలు జరుపుతారు. సుష్మ వెంట ఉన్నత స్థాయి అధికారుల బృందం కూడా వెళుతోంది.