: ఒక్క మాటతో భాగల్పూర్ లో ఉద్రిక్తత


బీహార్ ను లవ్ జీహాద్ కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన టీనేజీ కుమార్తెను నలుగురు వ్యక్తులు బలవంతంగా మతం మార్పించారని పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా ఆ యువతి తానే స్వచ్ఛందంగా ప్రేమికుడి వెంట వెళ్లానని తెలిపింది. దీంతో న్యాయస్ధానం నిందితులను వదిలేసింది. దీనిని నిరసిస్తూ విశ్వహిందూపరిషత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ హింసాత్మకంగా మారింది. కర్రలు చేబూనిన వీహెచ్ పీ కార్యకర్తలు భాగల్పూర్ రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో పలు దుకాణాలను ధ్వంసం చేశారు. వాహనాలను నాశనం చేసి వాటి యజమానులపై దాడులకు పాల్పడ్డారు. రైళ్ల రాకపోకలు అడ్డుకున్నారని ఎస్ఎస్పీ వివేక్ కుమార్ తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తతలు సడలాయని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News