: అమీర్ పేటలో సందడి చేసిన ఇషాచావ్లా
హైదరాబాదులోని అమీర్ పేటలో 'లవ్ లీ' సినిమా ఫేమ్, నటి ఇషాచావ్లా సందడి చేశారు. అమీర్ పేటలోని ఆర్.ఎన్. బ్రదర్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన ఇషాచావ్లా కేక్ కట్ చేసి యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా కాసేపు అభిమానులను పలకరించి సందడి చేశారు.