: కేసీఆర్ మాటల మనిషి: షబ్బీర్ అలీ
కేసీఆర్ హామీలన్నీ మాటలకే పరిమితమయ్యాయని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ మాటల మనిషని అన్నారు. 100 రోజుల పాలనలో కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎన్నో మంచి పనులు చేసిందని ఆయన తెలిపారు. సకాలంలో రైతులకు రుణమాఫీ, 7 గంటల ఉచిత విద్యుత్ అందజేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు.