: ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం: కేటీఆర్


తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థం లేనివని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పని గట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి పట్టణానికి, గ్రామానికి మంచినీరు సరఫరా చేయడమే వాటర్ గ్రిడ్ లక్ష్యమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News