: జమ్మూకాశ్మీర్ కు ఉత్తరాఖండ్ భూరి విరాళం
వరదలతో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్ ను ఆదుకునేందుకు రాష్ట్రాలు ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి. గతంలో ఇలాంటి వరదలతో కుదేలైన చిన్న రాష్ట్రం ఉత్తరాఖండ్ సైతం జమ్మూకాశ్మీర్ కు పది కోట్ల రూపాయల భూరి విరాళం ప్రకటించింది. ఒడిశా ప్రభుత్వం 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.