: ఆ విమానం ఇలా కూలిపోయింది... ఘటనపై డచ్ నివేదిక


మలేసియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంహెచ్ 17 విమానం ఎందుకు కూలిపోయిందనే దానిపై నెదర్లాండ్స్ దర్యాప్తు బృందం నివేదిక ఇచ్చింది. జూలై 17న మలేసియాకు చెందిన ఎంహెచ్ 17 విమానం ఉక్రెయిన్ సరిహద్దుల్లో కూలిపోగా, 298 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ సమాజం జోక్యంతో విమాన ప్రమాదంపై డచ్ బృందం దర్యాప్తు చేసింది. ఉక్రెయిన్ తీవ్రవాదులు క్షిపణితో విమానాన్ని కూల్చేశారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ డచ్ బృందం ఓ బలమైన వస్తువు ఢీ కొట్టడం వల్లే విమానం కూలిపోయిందని నిర్ధారించింది. దానిని క్షిపణి అని పేర్కొనని డచ్ దర్యాప్తు బృందం, బయటి నుంచి బలమైన వస్తువు విమానాన్ని ఢీ కొట్టిందని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News