: కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గల్లంతే: వినోద్
మెదక్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గల్లంతేనని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ, మెదక్ ప్రజల తీర్పు టీఆర్ఎస్ వైపేనని అన్నారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై కేసీఆర్ స్పష్టమైన వైఖరితో ఉన్నారని అన్నారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో 100 రోజుల పాలనలోనే కేసీఆర్ చూపించారని ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించుకుంటామని వినోద్ స్పష్టం చేశారు. లోక్ సభలో జరిగే ప్రతి చర్చలోనూ తాము పాల్గొంటామని ఆయన వెల్లడించారు.