: రేపు తెలంగాణలో విద్యా సంస్థల బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు
తెలంగాణలో రేపు విద్యా సంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తూ బంద్ కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ, ఎన్ యస్ యూ, టీఎన్ఎస్ఎఫ్, ఎంఎస్ఎఫ్ సంఘాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు పేర్కొంది. దాంతో, కొన్నాళ్ల నుంచి విద్యార్థి సంఘాలు నిరసనను కొనసాగిస్తున్నాయి.