: బస్ హైజాక్ చేసి 9 మంది మృతికి కారణమైన ఉన్మాద డ్రైవర్ కు మరణశిక్ష ఖరారు
పుణేలో 2012 జనవరి 25న సంతోష్ ఎం మానే ఓ బస్ డ్రైవర్ తనకు డే డ్యూటీ వేసేందుకు నిరాకరించారంటూ అధికారులపై ఆగ్రహించి, బస్ ను హైజాక్ చేసి తొమ్మిది మంది మరణానికి కారణమయ్యాడు. ఆ ఉన్మాద డ్రైవర్ కు మరణశిక్ష ఖరారు చేస్తూ బాంబే హైకోర్టు మంగళవారం నాడు తీర్పు వెలువరించింది. సంతోష్ రోడ్డు రవాణా సంస్థ అధికారులపై కోపంతో స్వర్ గేట్ బస్ డిపో నుంచి బస్సును హైజాక్ చేసి 16 కిలోమీటర్లు ఇష్టం వచ్చినట్టు నడిపాడు. ఈ క్రమంలో 9 మంది పాదచారులు దుర్మరణం పాలయ్యారు. చాలామంది గాయపడ్డారు.