: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో 11వ ఛార్జిషీటు దాఖలు


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా ఇందూ గృహ నిర్మాణం ప్రాజెక్టులపై సీబీఐ ఈరోజు అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఈ మేరకు హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు 11వ ఛార్జిషీటును సమర్పించింది. సీబీఐ మొత్తం 14 మందిని ఇందులో నిందితులుగా పేర్కొంది. నిందితుల్లో జగన్, ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, విజయసాయి, ఐఏఎస్ అధికారి, అప్పటి గృహ నిర్మాణ ఎండీ మహంతి, వైవీ సుబ్బారెడ్డి తదితరుల పేర్లను పేర్కొంది. వైఎస్ హయాంలో కూకట్ పల్లి, నాగోలు, గచ్చిబౌలి, నంద్యాల వంటి పలుచోట్ల గృహ నిర్మాణ ప్రాజెక్టులను ఇందూకు అప్పగించారని, అందులో అక్రమాలు జరిగాయని సీబీఐ నిర్ధారించింది. చాలా తక్కువ ధరకు ఇందూకు ప్రాజెక్టులు కేటాయించినట్లు అభియోగపత్రంలో తెలిపింది. అందుకు గాను జగన్ సంస్థల్లో రూ.70 కోట్లు శ్యామ్ ప్రసాద్ రెడ్డి పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News