: మరో దీక్షకు సిద్ధమవుతున్న జగన్... వచ్చేనెల రెండు రోజుల పాటు దీక్ష
వైఎస్సార్సీపీ అధినేత జగన్ మరో దీక్షకు సిద్ధమవుతున్నారు. వచ్చేనెలలో రెండు రోజులపాటు నిరాహార దీక్ష చేయనున్నట్టు పార్టీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ప్రకటించారు. హైదరాబాదులో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు రుణమాఫీపై నరసాపురం పట్టణంలో రెండు రోజులపాటు నిరాహార దీక్షకు దిగనున్నానని అన్నారు. తాను చేపట్టనున్న దీక్షపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన సూచించారు. ఆ రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలతో రాష్ట్రాన్ని హోరెత్తించాలని జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.