: అమ్మాయిల హాస్టల్లో అర్థరాత్రి ఆగంతుకుడు... ప్రిన్సిపల్ భర్తేనా?
అమ్మాయిల హాస్టల్లో అర్ధరాత్రి ఓ ఆగంతుకుడు ప్రవేశించిన వ్యవహారం విజయనగరం జిల్లాలో కలకలం రేపింది. నెల్లిమర్లలోని వేణుగోపాలపురం కాలనీలో సాంఘిక సంక్షేమ జూనియర్ కాలేజి, హైస్కూలు, హాస్టల్ ఒకే ప్రాంగణంలో ఉంటాయి. కొత్తగా డార్మిటరీ నిర్మాణం జరుగుతోంది. దాంతో కొన్ని కిటికీలు తొలగించి ఉన్నాయి. నాలుగో తేదీ అర్ధరాత్రి 12 గంటలకు.. తొలగించిన ఓ కిటికీలోంచి ఓ ఆగంతుకుడు నగ్నంగా లోపలకు ప్రవేశించాడు. టీచర్స్ డే కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రాక్టీస్ చేసిన విద్యార్థినులు గాఢనిద్రలో ఉండడంతో, నెమ్మదిగా అమ్మాయిల పక్కన పడుకుని వారి దుస్తులను కూడా బ్లేడుతో తొలగించాడు. అతని చేష్టలకు మెలకువవచ్చిన బాలికలు కేకలు వేశారు. కాగా, విద్యార్థినులు కేకలు వేసిన అరగంటకు కానీ వార్డెన్, ప్రిన్సిపల్ రాలేదు. ఈలోగా ఆగంతుకుడు దుప్పటి కప్పుకొని పారిపోయాడు. ఏడో తేదీన కొంతమంది తల్లిదండ్రులు రావడంతో విద్యార్థినులు జరిగిన విషయం వారికి వివరించారు. వారి ఫిర్యాదుతో జడ్పీ ఛైర్పర్సన్ శోభా స్వాతిరాణి, సోషల్ వెల్ఫేర్ జోనల్ ఆఫీసర్ శేషుకుమారి విచారించారు. కాగా ఆగంతుకుడి రూపంలో విద్యార్థినుల దగ్గరికి వెళ్లింది ప్రిన్సిపల్ భర్తేనని పలు విద్యార్థి సంఘాల నేతల ఆరోపిస్తున్నారు. వివాదం సద్దుమణగకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, అక్కడ పని చేస్తున్న కూలీలను విచారిస్తున్నారు.