: సస్పెండైన అజ్మల్ కు సాయం చేస్తానంటున్న 'దూస్రా' సృష్టికర్త


బౌలింగ్ యాక్షన్ నియమావళికి వ్యతిరేకంగా ఉందని పాక్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ పై ఐసీసీ వేటు వేయడం తెలిసిందే. ఆఫ్ స్పిన్నర్ల అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రమనదగ్గ 'దూస్రా' సృష్టికర్త, పాక్ సీనియర్ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ తాను అజ్మల్ కు సాయపడతానంటున్నాడు. అజ్మల్ కోరితే అతని బౌలింగ్ యాక్షన్ ను సరిదిద్దుతానంటున్నాడు. ఈ మేరకు ట్విట్టర్లో పేర్కొన్నాడు. అజ్మల్ ను మళ్ళీ అంతర్జాతీయ యవనికపై నిలిపేందుకు శక్తిమేర సాయపడతానని తెలిపాడు. కాగా, బంతిని విసిరే సమయంలో బౌలర్ తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచితే అది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. తద్వారా అజ్మల్ విసిరే అన్నిరకాల బంతులు అక్రమమేనని ఐసీసీ నిర్ణయం తేటతెల్లం చేస్తోంది.

  • Loading...

More Telugu News