: కేసీఆర్ పాలనపై '100 రోజుల్లో 100 తప్పులు' పేరిట పుస్తకం విడుదల
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా '100 రోజుల్లో 100 తప్పులు' పేరిట పుస్తకాన్ని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విడుదల చేశారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొన్నాల మాట్లాడుతూ, కేసీఆర్ హిట్లర్ ని మరిపిస్తున్నాడని, తుగ్లక్ ను తలపిస్తున్నాడని వ్యాఖ్యానించారు.