: తెలంగాణలో ఏర్పడబోయే కొత్త జిల్లాల పేర్లు... వివరాలు


తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఓ స్పష్టతకు వచ్చింది. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను 24 జిల్లాలుగా విస్తరించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న కొత్త జిల్లాల వివరాలు ఇవే... హైదరాబాద్ జిల్లాను... చార్మినార్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్ జిల్లాలుగా మహబూబ్ నగర్ జిల్లాను... మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలుగా మెదక్ జిల్లాను... సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలుగా ఆదిలాబాద్ జిల్లాను... మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలుగా ఖమ్మం జిల్లాను... కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలుగా నల్లగొండ జిల్లాను... సూర్యాపేట, నల్లగొండ జిల్లాలుగా వరంగల్ జిల్లాను... వరంగల్, భూపాలపల్లి, జనగాం జిల్లాలుగా రంగారెడ్డి జిల్లాను... వికారాబాద్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లాలుగా కరీంనగర్ జిల్లాను... కరీంనగర్, జగిత్యాల జిల్లాలుగా విడదీస్తున్నారు. ఇక, నిజామాబాద్ జిల్లాను... నిజామాబాద్ గానే ఉంచుతున్నారు. అయితే, ఈ జిల్లాలోని కామారెడ్డి డివిజన్ ను కొత్తగా ఏర్పడబోయే సిద్దిపేట జిల్లాలో కలుపుతారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజనకు త్వరలో రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనుంది. ఆ తర్వాత దాన్ని చట్టరూపంలో ప్రవేశపెట్టి కేంద్రానికి నివేదిస్తారు. కేంద్రం అంగీకారం తెలపగానే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయి.

  • Loading...

More Telugu News