: ఆ ముగ్గురూ రాణిస్తే ప్రపంచకప్ ఇండియాదే: షోయబ్ అక్తర్
భారత్ పేస్ త్రయం మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, వరుణ్ అరోన్ లు రాణిస్తే... ఇండియాను ఎవరూ ఆపలేరని పాకిస్థాన్ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరిగే వరల్డ్ కప్ లో వీరు ముగ్గురూ అత్యంత కీలకమని చెప్పాడు. వీరికి మరింత మెరుగైన కోచింగ్ ఇవ్వాలని... గాయాల బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించాడు. వీరు ముగ్గురూ పూర్తి ఫిట్ నెస్ తో ఉంటే... ప్రపంచకప్ లో ఏ దేశం కూడా భారత్ ను నిలువరించలేదని... మూడో ప్రపంచకప్ ను టీమిండియా సాధించడం ఖాయమని తెలిపాడు.