: నిండుకుండలా మారిన శ్రీశైలం జలాశయం
విద్యుదుత్పత్తిలో కీలకపాత్ర పోషించే శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 1.77 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో, 3 గేట్లను ఎత్తివేసి 1.63 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.