: ఆంధ్రప్రదేశ్ కు త్వరలోనే ప్రత్యేక హోదా!
ఆంధప్రదేశ్ కు త్వరలోనే ప్రత్యేక హోదాను ప్రకటిస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మాలా సీతారామన్ అన్నారు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసినప్పటికీ... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తదని ఆమె స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాను ప్రతీరోజు కసరత్తు చేస్తున్నానని ఆమె అన్నారు. స్పష్టమైన తేదీని ఇప్పటికిప్పుడు చెప్పలేనప్పటికీ... వీలైనంత త్వరగా ప్రత్యేక హోదాను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.