: ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ లను మట్టికరిపించండి: మంద కృష్ణ


ఆంధ్రప్రదేశ్ లోని నందిగామ శాసనసభ స్థానం, తెలంగాణలోని మెదక్ లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తనదైన పాత్ర పోషించేందుకు ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ సిద్ధమయ్యారు. నందిగామలో టీడీపీకి, మెదక్ లో బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో నందిగామ టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్యను కలసి మద్దతు తెలిపారు. అంతేకాకుండా, ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్న టీడీపీ, బీజేపీలకు మాదిగలంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు.

  • Loading...

More Telugu News