: మోడీని కొనియాడిన కాంగ్రెస్ సీనియర్ నేతలు
భారత ప్రధాని మోడీ ప్రత్యర్థులచేత శభాష్ అనిపించుకుంటున్నారు. చిరకాల ప్రత్యర్థి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, మోడీని ప్రశంసించిన కాసేపటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, గులాంనబీ ఆజాద్ ఆయనను ప్రస్తుతించారు. జమ్మూకాశ్మీర్ వరదలపై ప్రధాని మోడీ స్పందించిన తీరు అద్భుతమని వారు కొనియాడారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించడం, తక్షణ సాయంగా 1000 కోట్ల రూపాయలు విడుదల చేయడం, భద్రతాదళాలను రంగంలోకి దించి సహాయకచర్యలను చేపట్టడం అమోఘమని వారు కీర్తించారు. మోడీ పని తీరు అద్భుతమని వారు ప్రశంసల్లో ముంచెత్తారు.