: గోదావరి కన్నెర్ర చేస్తోంది... జలమయమైన ఇళ్లు, మునిగిన పొలాలు
గోదారి కన్నెర్ర చేస్తోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ ఎత్తున ప్రవహిస్తున్న ఉపనదుల కారణంగా గోదావరి నది పోటెత్తింది. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అక్కడి మత్స్యకారులను, ముంపు ముప్పు పొంచి ఉన్న గ్రామల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే ఇళ్లు జలమయ్యాయి. పొలాలు నీట మునిగాయి. ఎప్పుడు ఎటు నుంచి వరద ముంచుకొస్తుందో తెలియని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను హెచ్చరిస్తున్నారు. వరదలను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 56 అడుగులకు చేరింది. దీంతో మూడవ నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. హైవేపై రాకపోకలు నిలిపేశారు.