: ఖైరాతాబాద్ గణేషుడిపై ఆకాశం నుంచి పూల వర్షం


హైదరాబాదులోని ఖైరతాబాద్ గణేషుడిపై ఆకాశం నుంచి పూలవర్షం కురిసింది. ఖైరతాబాద్ మహాగణపతి భారీవిగ్రహానికి ఈ ఏడాదే చివరి ఏడు కానుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాగణపతి నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో సరిగ్గా 5:30 నిమిషాలకు హెలీకాప్టర్ తో మూడు క్వింటాళ్ల పూల వర్షం కురిపించింది. ఆకాశం నుంచి పూల వర్షం కురవడంతో భక్తులు ఆనందపారవశ్యంలో మునిగిపోయారు. హెలీకాప్టర్ నుంచి పూలవర్షం కురియనుందని ముందుగానే భక్తులకు తెలియడంతో ఖైరతాబాద్ రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. మహాగణపతిపై పూల వర్షం కురిపించినప్పుడు హెలీకాప్టర్ లో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు. పూల వర్షం కురిసినప్పడు దిక్కులన్నీ ప్రతిధ్వనించేలా ప్రజలంతా 'జై బోలో గణేష్ మహారాజ్ కీ జై' అంటూ నినదించారు.

  • Loading...

More Telugu News