: ఆ ఇద్దరినీ చంపినవారికి కళ్ళు చెదిరే నగదు బహుమతి!
ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్-బాగ్దాదీ, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ లను చంపిన వారికి రూ.5 కోట్లు బహుమతిగా ఇస్తామని లక్నోలోని ఆలిండియా షియా హుస్సేని ఫండ్ (ఏఐఎస్ హెచ్ఎఫ్) ప్రకటించింది. ఈ మేరకు సదరు షియా ఆర్గనైజేషన్ ఓ హిట్ లిస్టును విడుదల చేసింది. ఈ జాబితాలో బాగ్దాదీ, హఫీజ్ లే కాకుండా, తాలిబాన్ చీఫ్ ముల్లా ఒమర్, అల్ ఖైదా చీఫ్ అయిమాన్ అల్ జవహరి, హర్కతుల్ ముజాహిదీన్ అధినేత అజర్ మసూద్ కూడా ఉన్నారు. కాగా, ఈ ఉగ్రనేతలను హతమార్చిన వారికి నగదు బహుమతి అంటూ పోస్టర్లను కూడా విడుదల చేశారు. దీనిపై, ఏఐఎస్ హెచ్ఎఫ్ చీఫ్ హసన్ మెహంది మాట్లాడుతూ, ఇస్లాం పేరిట విధ్వంసాలకు పాల్పడుతున్న ఇలాంటి టెర్రరిస్టు సంస్థలకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాడాలని పేర్కొన్నారు.