: 'జై బోలో తెలంగాణ' బాలనటుడు అమన్ హఠాన్మరణం
మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన బాలనటుడు అమన్ (12) హఠాన్మరణం పాలయ్యాడు. ఒక్కసారిగా బీపీ తగ్గిపోవడంతో బాలుడిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అమన్ 'జై బోలో తెలంగాణ', 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'తో పాటు పలు సినిమాల్లో నటించాడు. బాలనటుడి హఠాన్మరణంతో గజ్వేల్ పట్టణంలో విషాదం నెలకొంది.