: కేసీఆర్ తో ఉద్యోగులకు విభేదాలు లేవు: దేవీప్రసాద్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆ రాష్ట్ర ఉద్యోగులకు విభేదాలున్నాయనే వార్తలకు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ తెరదించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రికి, ఉద్యోగులకు మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని స్పష్టం చేశారు. ఉద్యోగులందరూ ప్రభుత్వంతో కలసే పనిచేస్తున్నారని తెలిపారు. మెదక్ లో మీడియాతో మాట్లడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.