: దేశంలోని ఇతర ప్రాంతాలతో కాశ్మీర్ కు సంబంధాలు తెగిపోయాయి


గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జమ్మూకాశ్మీర్ ను వరదలు ముంచెత్తాయి. దీంతో, కాశ్మీర్ లోని టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో, ఆ రాష్ట్రం దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలను పూర్తిగా కోల్పోయింది. టెలికమ్యూనికేషన్స్ సదుపాయం కల్పిస్తున్న బీఎస్ఎన్ఎల్ తో పాటు ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి సంబంధించిన వ్యవస్థలు కూడా నాశనం అయ్యాయి. ఈ క్రమంలో వాటిని పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. శాటిలైట్ ఆధారిత సర్వీసులను పునరుద్ధరించగల నిపుణులను కాశ్మీర్ కు తరలించారు. హైదరాబాద్, బెంగళూరుకు చెందిన నిపుణులు ఇప్పటికే కాశ్మీర్ చేరుకున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News