: బీజేపీపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్


ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ లు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఈ విషయంలో ఏమాత్రం అమాయకుడు కాదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు ఆమ్ ఆద్మీ కూడా ప్రయత్నాలు చేసిందని ఢిల్లీ కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆమ్ ఆద్మీ పార్టీ డబ్బుతో ప్రలోభపెట్టేందుకు చూసిందని ఆయన అన్నారు. ఢిల్లీలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడితో కేజ్రీవాల్ సంప్రదింపులు కూడా జరిపారని సందీప్ దీక్షిత్ అన్నారు.

  • Loading...

More Telugu News