: కుమారుడి కేసులో రైల్వే మంత్రి సదానందకు నోటీసు
కుమారుడు కార్తీక్ గౌడపై నమోదైన కేసు రైల్వే మంత్రి సదానంద గౌడకు మరింత తలనొప్పిగా మారింది. కన్నడ నటి మైత్రేయ పెట్టిన కేసులో కార్తీక్ పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని (కొడుకుని) స్వయంగా విచారణాధికారి ముందుకు తీసుకురావాలని సదానందకు బెంగళూరు ఆర్టీనగర్ పోలీసులు నోటీసు ఇచ్చారు. ఇరవై నాలుగు గంటల్లో హాజరుపర్చాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు మెయిల్ ద్వారా నోటీసును పోలీసులు మంత్రికి పంపించినట్లు సమాచారం. అటు ఆయన ఇంటి తలుపులకు కూడా నోటీసును అంటించారట. ఇదిలాఉంటే, నటి మైత్రేయ తుంకూర్ లో ప్రత్యేక పూజలు చేసిందట. తనకున్న సమస్యలన్నింటినీ తీర్చాలని దేవుడిని ప్రార్థించిందట. అంతేకాక బెంగళూరు శివారులోని ఘటి సుబ్రహ్మణ్య దేవాలయంలో మహాకాళ సర్ప యజ్ఞం కూడ చేసిందట.