: ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: కేజ్రీవాల్
ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులను ఆయన విడుదల చేశారు. ఈ రుజువుల ద్వారా బీజేపీపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అవసరమనుకుంటే... వీటిని కోర్టులో కూడా ప్రవేశపెడతామని ఆయన వెల్లడించారు. అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. తమపై అనవసరంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేజ్రీవాల్ ను దుయ్యబట్టింది. ఇక ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే... ఎమ్మెల్యేలను ఢిల్లీ విడిచి వెళ్లవద్దని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆదేశించారు.