: కడప జిల్లా బద్వేల్ సమీపంలో భారీగా ఎర్రచందనం పట్టివేత
కడప జిల్లా బద్వేల్ కు దగ్గరలోని అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనాన్ని అటవీ అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.కోటి విలువ చేసే పది టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతంగా ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అటవీ అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు.