: అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐ డైరెక్టర్ కు సుప్రీం ఆదేశం


సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా మెడకు 2జీ కేసు ఉచ్చు బిగుసుకునేలా కనిపిస్తోంది. ఈ కేసులో ప్రముఖ న్యాయవాది, ఏఏపీ నేత ప్రశాంత్ భూషణ్ చేస్తున్న ఆరోపణలపై అఫిడవిట్ సమర్పించాలని సిన్హాను సుప్రీంకోర్టు ఆదేశించింది. వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని, నిజానిజాలను అఫిడవిట్ లో స్పష్టంగా చెప్పాలని ఆదేశాల్లో తెలిపింది. సీబీఐ డైరెక్టర్ పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయని, అఫిడవిట్ దాఖలు చేయాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. స్పందించిన సిన్హా... సీల్డ్ కవర్ లో అఫిడవిట్ సమర్పించేందుకు అంగీకరించారు. అనంతరం, కోర్టు ఈ నెల 15 (వచ్చే సోమవారం)కు విచారణ వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా, సిన్హా కొంతమంది ప్రముఖులను కేసు నుంచి రక్షించేందుకు ప్రయత్నించారంటూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తీవ్ర ఆరోపణలు చేస్తూ గతంలో సుప్రీంకు పిటిషన్ రూపంలో సమర్పించారు.

  • Loading...

More Telugu News