: ఖైరతాబాద్ గణేశుడికి నేడు పూలవర్షం
హైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతికి నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పూలవర్షం కార్యక్రమం జరగనుంది. నిమజ్జనం చివరిరోజు కావడంతో హెలికాప్టర్ తో పూలవర్షం కురిపించనున్నారు. అందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు, గణపతిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. దాంతో, ఖైరతాబాద్ దారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.