: సెల్వమణితో 'విడాకుల' వార్తలను ఖండించిన రోజా
సినీనటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా... ఆమె భర్త సెల్వమణితో విడాకులు తీసుకోనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా ఇటు హైదరాబాద్ లోను అటు చెన్నై లోను హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలను రోజా ఆదివారం ఖండించారు. తన భర్త సెల్వమణితో తనకు ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని... కేవలం ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ వల్లే తామిద్దరం ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నామని ఆమె స్పష్టం చేశారు. సెల్వమణి తన సినిమాలకు సంబంధించిన విషయాలతో చెన్నైలో బిజీగా ఉన్నారని, ఆంధప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా ఉండేందుకు తాను హైదరాబాద్ లో ఉంటున్నానని రోజా పేర్కొన్నారు. ఇలా తామిద్దరం విడివిడిగా ఉండటం వల్ల... చాలా మంది ఏవేవో ఊహించుకుని ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు.