: రూ.9.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
హైదరాబాదు శివారులోని బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం పాట పూర్తయింది. ఈ సారి లడ్డూ రూ.9.50 లక్షలు పలికింది. స్థానికుడు సింగిరెడ్డి జయేందర్ రెడ్డి అనే వ్యక్తి అంత మొత్తాన్ని వెచ్చించి లడ్డూను సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఈ లడ్డూ రూ.9.26 లక్షలు పలకగా ఈ ఏడాది రూ.24వేలు అధికంగా పలికింది. ఈ వేలం పాటలో మొత్తం 24 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు.