: హెచ్ సీఏ ఎన్నికల్లో వినోద్ కు భంగపాటు... అర్షద్ ప్యానెల్ క్లీన్ స్వీప్


హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల్లో మాజీ మంత్రి జి. వినోద్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్ ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో అర్షద్ అయూబ్ హెచ్ సీఏ నూతన అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్దమైంది. అంతేకాక రాజకీయ నేపథ్యమున్న వారికి కార్యవర్గంలో చోటు అవసరం లేదన్న క్రీడాకారుల ఆశకు కూడా ఈ ఎన్నికల ఫలితాలు జీవం పోశాయి. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఎన్నిలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగియగానే ఏజీఎం భేటీ నిర్వహించిన వినోద్ పై పలువురు సభ్యులు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సభ్యులు అసభ్య పదజాలాన్ని కూడా వాడారు. దీంతో భేటీని గురువారానికి వాయిదా వేసిన వినోద్ ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించారు. కౌంటింగ్ పూర్తి చేసిన అధికారులు అర్షద్ అయూబ్ ప్యానెల్ అన్ని పదవులను కైవసం చేసుకుందని ప్రకటించడంతో వినోద్ నిరాశతో అక్కడినుంచి నిష్క్రమించారు.

  • Loading...

More Telugu News