: బెదిరింపుల అభిమానికి జడేజా వినూత్న ఆఫర్


తనను చంపేస్తానంటూ ఓ టీనేజ్ మహిళా అభిమాని చేస్తున్న బెదిరింపులకు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త రీతిలో స్పందించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచేశాడు. ‘నిన్ను చంపేస్తాను’ అంటూ ఓ అమ్మాయి జడేజాను కొద్దికాలం నుంచి బెదిరిస్తోందట. ట్విట్టర్ ద్వారా తనకు ఎదురైన ఆ అమ్మాయి బెదిరింపులను జడేజా అంత సీరియస్ గా ఏమీ తీసుకోలేదట. సాధారణంగా సెలబ్రిటీలకు వచ్చే ఇలాంటి ఫిర్యాదులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే, ఆ అమ్మాయి బెదిరింపులను తేలిగ్గానే తీసుకున్న జడేజా, అటు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇటు వదిలేయలనూ లేదు. ‘‘చంపేస్తాను అన్న పదం బదులు ‘ముద్దు’ పెట్టుకుంటాను’’ అని బెదిరించమని ఆ అమ్మాయికి కొంటెగా సమాధానమిచ్చాడట. చంపేస్తానన్న బెదిరింపులపై ఇలా కవ్వింపు కామెంట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన జడేజా వ్యాఖ్యలు పలువురిని ఆకట్టుకోవడమే కాక వారిలో నవ్వులనూ పూయిస్తున్నాయి.

  • Loading...

More Telugu News