: మీడియా ముందుకు టీవీ యాంకర్ హర్షవర్ధన్ ముఠా


దుగ్గిరాల డెంటల్ కళాశాల యాజమాన్యాన్ని లంచం డిమాండ్ చేస్తూ పట్టుబడిన టీవీ యాంకర్ హర్షవర్ధన్ ముఠాను ఆదివారం సాయంత్రం ఏలూరు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. కళాశాలలో చోటుచేసుకున్న అక్రమాల క్లిప్పింగ్ లను బయటపెట్టకుండా ఉండాలంటే రూ. 10 కోట్లు చెల్లించాలని హర్షవర్ధన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. హర్షవర్ధన్ బెదిరింపుల నేపథ్యంలో కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెంటల్ కళాశాల యాజమాన్యం ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు ఓ సెటిల్ మెంట్ కోసం ఏలూరు వచ్చిన హర్షవర్ధన్ తో పాటు మరో ఇద్దరిని శనివారం విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు చెందిన మరో ఇద్దరిని భీమడోలులో అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు కార్లు, ఐదు మొబైల్ ఫోన్లు, రూ. 37, 450 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు డీఎస్పీ సత్తిబాబు మీడియాకు వెల్లడించారు. నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News