: గణేశ్ లడ్డూ వేలంలో వెల్లివిరిసిన మత సామరస్యం
గణేశ్ నవరాత్రి ఉత్సవాల చివరి ఘట్టంలో మత సామరస్యం వెల్లివిరిసింది. వరంగల్ లోని సెకండ్ బ్యాంక్ కాలనీలో ఆదివారం ఈ అరుదైన ఘటన నమోదైంది. గణేశ్ లడ్డూ వేలంలో పాల్పంచుకున్న ముస్లిం వ్యక్తి, విజయం సాధించారు. అంతేనా, అత్యంత భక్తి ప్రపత్తులతో లడ్డూను అందుకున్న మహ్మద్ రషీద్, వేలంలో గెలిచినందుకు సంతోషంగా ఉందని ప్రకటించారు. తన చర్యతో మత సామరస్యానికి మారుపేరుగా నిలిచిన రషీద్ ను ఇటు హిందూ భక్తులతో పాటు అటు ముస్లిం సోదరులు కూడా ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. వేలంలో పాల్గొన్న రషీద్, రూ. 51 వేలకు గణపతి లడ్డూను దక్కించుకున్నారు.