: ఆ కేసులు వెంట్రుక కూడా పీకలేవు: టీ సర్కారు కేసులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్య


మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్, విపక్ష టీడీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆదివారం ఈ మాటల తూటాలు హద్దులు కూడా దాటేశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత రేవంత్ రెడ్డి, తన దూకుడును మరింత పెంచారు. తనపై టీఆర్ఎస్ సర్కారు నమోదు చేసిన కేసులు వెంట్రుక కూడా పీకలేవని ప్రకటించి, కలకలం రేపారు. టీఆర్ఎస్ పెట్టించే కేసులకు భయపడేవారు టీడీపీలో ఎవరూ లేరన్న రేవంత్ రెడ్డి ఒక్కసారిగా తన స్వరం పెంచేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు జగ్గారెడ్డి సరైన మొగుడని ప్రకటించిన రేవంత్ తాజాగా కేసులపై ఈ తరహా వ్యాఖ్యలు చేడయంతో పరిస్థితి శ్రుతి మించిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News