: ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పండి: నందిగామ ఓటర్లకు రఘువీరా పిలుపు


నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. నందిగామ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి బాబూరావు తరఫున ప్రచారం చేసేందుకు ఆదివారం నందిగామ వచ్చిన రఘువీరా, అక్కడ ఏర్పాటు చేసిన రైతు, డ్వాక్రా మహిళల సదస్సులో ప్రసంగించారు. ఎన్నికల సందర్భంగా పంట రుణాలతో పాటు డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత హామీల అమలును అటకెక్కించారని ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోతే, ఏం జరుగుతుందన్న విషయాన్ని చంద్రబాబుకు ఉప ఎన్నికల్లో నందిగామ ఓటర్లు రుచి చూపించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News