: మూడు రోజులుగా విశాఖ జిల్లాను ముంచెత్తుతున్న వర్షాలు
మూడు రోజులుగా విశాఖ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో జిల్లా పరిధిలోని వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. మారుమూల గ్రామాలకు ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెనలు వరద ధాటికి కొట్టుకుపోయాయి. దీంతో జిల్లాలోని 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జీ మాడుగుల మండలంలో ఇద్దరు వరద నీటిలో పడి కొట్టుకుపోయినట్లు సమాచారం. మరో రెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.