: వనస్థలిపురంలో భారీగా నగలు, నగదు చోరీ
హైదరాబాదు నగరంలోని వనస్థలిపురంలో ఓ అపార్ట్ మెంట్ లోని ఇంట్లో శనివారం అర్ధరాత్రి దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. వనస్థలిపురం పీఎస్ పరిధిలోని హుడాసాయినగర్ లోని కల్పనా ఎన్ క్లేవ్ లో ఆగంతుకులు 55 తులాల బంగారు నగలతో పాటు చేతికందిన రూ.10 వేల నగదును ఎత్తుకెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.