: అత్యాచారం కంటే బాల్య వివాహం దారుణం: ఢిల్లీ కోర్టు
బాల్యవివాహాలపై ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం కంటే బాల్యవివాహం దారుణమని న్యాయస్థానం పేర్కొంది. 14 ఏళ్ల వయసులోనే ఓ బాలికకు వివాహం చేశారు. భర్త, అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఆ బాలిక కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని కోర్టు వ్యాఖ్యానించింది. సమాజంలో బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టాలని సూచించింది.